సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ-
శేరిలింగంపల్లి మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తున్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ
భారత శక్తి సెప్టెంబర్ 28 శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల వరిధిలోని ఖానామెట్ సర్వేనెంబర్ 41/13లో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదారుల నుండి కాపాడాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ, చందు యాదవ్లు శేరిలింగంపల్లి మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుకు ఖానామెట్ సర్వే నెంబర్ 11/13లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారి నుండి కాపాడాలన్నారు.. సుమారు 3 వంద కోట్ల విలువగల భుమి వెంటనే ప్రభుత్వం బ్లూ షీట్లను తొలగించి భూమిని స్వాధీనం చేసుకొఇ భూ కబ్జాదారులను అరెస్ట్ చేయాలన్నారు. ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు లేదా పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ల కొరకు ఉపయోగపడే విధంగా చర్యలు తక్షణమే చేయాలని ప్రభుత్వ అధికారులను వినతి పత్రం కొరడం జరిగిందన్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కమ్యూనిస్టు కార్యకర్తలతో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, రామస్వామి, కొండలయ్య, వాసు తదితరులు పాల్గొన్నారు.


