Friday, August 21, 2026
Google search engine
Homeతెలంగాణఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'అమీర్ లోగ్' సినిమా

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘అమీర్ లోగ్’ సినిమా

హైదరాబాద్

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వీఈ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్ రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ భాగంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో మాట్లాడుతూ, తన వ్యక్తిగత, చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. కథలు రాయడం, చదవడం నాకు చాలా ఇష్టం. ఆరేడేళ్ల నుంచి కథలు రాయడం ప్రారంభించాను. నా సొంత అనుభవాలు, చూసిన వాస్తవాల నుండి వాటి నుంచి ఎన్నో రాసేవాడిని తర్వాత సినిమాలకు కథలు ఎలా రాయాలని నా స్నేహితుడి ద్వారా నేర్చుకున్నాను.యూ ట్యూబ్ ద్వారా కొంత నేర్చుకున్నాను. ఆ తర్వాత కొంత మంది ఫ్రెండ్స్ సాయంతో షూటింగ్ సెట్లకు వెళ్లాను. అలా మెల్లిగా సినిమాలతో నా జర్నీ ప్రారంభమైంది. ‘అమీర్ లోగ్’ అనే టైటిల్ ను ముందు ఫిక్స్ అయ్యాను. అక్కడి నుంచి అసలైన అమీర్ లోగ్ ఎవరు..? అని రకరకాలుగా రాసుకు న్నాను. ఓ బస్తీ, ముగ్గురు కుర్రాళ్లు అని కథను రాయడం ప్రారంభించాను.హైదరాబాద్ బస్తీని తెరపై అద్భుతంగా చూపించాలని అనుకున్నాను. రెండేళ్ల క్రితం స్క్రిప్ట్ పూర్తయింది. అందరితో చర్చించి, అందరి సలహాలు తీసుకునే స్క్రిప్ట్ రెడీ చేశాను. డెమో షూటింగ్ చేసి చాలా మందికి చూపించాం. ఆర్టిస్టులు ఎంతో నేచురల్ గా నటించారు. కొంత డబ్బింగ్ చెప్పారు. కానీ నేను సెట్లో ఫీలైనట్టుగా.. డబ్బింగ్ తర్వాత ఫీల్ అవ్వలేకపోయాను. సౌండింగ్ నాకు సెట్ కాలేదు. అందుకే సింక్ సౌండ్కి వెళ్లాను. పైగా ఇలాంటి సినిమాకి అన్నీ సహజంగానే ఉండాలి. సెట్లు కూడా వేయలేం. బస్తీలోనే షూట్ చేయాలని నిర్ణయం తీసుకొని కష్టపడి సినిమా తీసామని అందరూ మా సినిమా చూసి మమ్ములను ఆశీర్వదించాలని రమణారెడ్డి కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments