యువకుడి ఆచూకీ కోసం సరూర్‌నగర్ పోలీసుల కేసు నమోదు
ఎల్బీనగర్
తల్లిదండ్రులు బండి కొనివ్వలేదనే కారణంతో కుటుంబసభ్యులతో గొడవపడి ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పద్మానగర్ కాలనీ, కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన డి. రాజశేఖర్ (61) కుమారుడు డి. దీక్షిత్ (29) డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని, మానసిక పరిస్థితి కూడా సరిగ్గ లేదని పోలీసులు తెలిపారు. ఈ నెల 1వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో బండి కొనివ్వలేదనే కారణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో గొడవపడి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా యువకుడి ఆచూకీ లభించకపోవడంతో తండ్రి రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సరూర్‌నగర్ పోలీసులు కేసు నంబర్ 1152/2026 నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని సరూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం వెల్లడించారు.


