Tuesday, October 27, 2026
Google search engine
Homeతెలంగాణబడుగుల గొంతుక.. ఉద్యమాల కేతనం: అల్లంపల్లి రామకోటి

బడుగుల గొంతుక.. ఉద్యమాల కేతనం: అల్లంపల్లి రామకోటి

  • మూడు దశాబ్దాల నిర్విరామ పోరాట పటిమ: విద్యార్థి సమస్యల నుంచి రిజర్వేషన్ల సాధన వరకు రాజీలేని పోరాటాలు.
  • డబ్బు రాజకీయాలకు సింహస్వప్నం: స్వతంత్ర అభ్యర్థిగా సంచలన విజయాలు, దొరల గడీలపై తిరుగుబాటు.
  • అంబేడ్కర్, పూలే బాటలో సామాజిక విప్లవం: “జనాభా ఎంత ఉంటే, అంత వాటా” అనే నినాదంతో శూద్రుల హక్కులకై సమర శంఖం.
  • తెలంగాణ రక్షణ సేన బీసీ వింగ్ సారథ్య బాధ్యతలు: బీసీల అభ్యున్నతి కోసం మరింత ఉధృతంగా భవిష్యత్ పోరాటాలు.

హైదరాబాద్:

కులమతాలకు అతీతంగా, పేద బడుగు బలహీన వర్గాల గొంతుకై నిలబడి, మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటాలు సాగిస్తున్న నిజమైన ఉద్యమ కేతనం అల్లంపల్లి రామకోటి. తెలంగాణ రక్షణ సేన పార్టీ బీసీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, నిబద్ధతకు, అంకితభావానికి మారుపేరుగా నిలుస్తున్నారు. దొరల గడీలను ఎండగడుతూ, పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ యోధుడి ప్రస్థానం నిరుద్యోగులకు, విద్యార్థులకు, శ్రామికులకు ఒక దిక్సూచి.

*మూడు దశాబ్దాల నిర్విరామ పోరాట పటిమ
నీతి, నిజాయితీ, నిబద్ధతలతో కూడిన సిద్ధాంతమే ఊపిరిగా అల్లంపల్లి రామకోటి ముందుకు సాగుతున్నారు. గత ముప్పై సంవత్సరాలుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సాధన కోసం, స్కాలర్షిప్ల కోసం విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ప్రభుత్వాల మెడలు వంచారు. చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు దక్కాలని, స్థానిక సంస్థలైన సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసి, జడ్పిటిసి స్థానాల్లో బీసీలకు నూట నూటికి నూరు శాతం న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపు కోసం హైకోర్టు ముందర సాగించిన మహోత్తర ధర్నాలు, రాష్ట్ర బంద్ నిర్వహణలో ఈయన పోషించిన పాత్ర అసాధారణమైనది.

*స్వతంత్ర అభ్యర్థిగా సంచలన విజయం
పాలకవర్గాల అహంకారానికి, డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా 2014 శాసనసభ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించారు. కేవలం అభ్యర్థిగా మాత్రమే కాకుండా, సాధారణ జనరల్ స్థానంలో, దొరలు రాజ్యమేలే చోట తన సత్తా చాటుకున్నారు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని, అన్నాసాగర్ సర్పంచ్ గా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అవినీతిని ఏకరువు పెడుతూ, ప్రజాధనాన్ని దోచుకుంటున్న వారిని నిలదీస్తున్న ఏకైక ధీరుడు రామకోటి.

*అంబేడ్కర్, పూలే బాటలో సామాజిక విప్లవం
‘దేశంలో జనాభా ఎంత ఉంటే, అంత వాటా కావాలి’ అనే నినాదంతో శూద్రుల హక్కులకై సమర శంఖం పూరించారు. ఓట్ల మీద ఉన్న ప్రేమ, పన్నుల మీద ఉన్న శ్రద్ధ.. అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బడుగు బలహీన వర్గాల మీద పాలకులకు లేదని నిప్పులు చెరిగారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మన వాళ్ళు అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో జీవితాన్నే ఉద్యమానికి ధారపోశారు. రాస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడిలు, పార్లమెంట్ ముట్టడిలు, మంత్రుల గెరావ్ లతో అలుపెరగని పోరాటం చేస్తూ జాతికి అంకితమయ్యారు. బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో నడుస్తూ, ఉద్యమాలే తన కులవృత్తిగా మలచుకున్న మహనీయుడు రామకోటి.

*తెలంగాణ రక్షణ సేన బీసీ వింగ్ సారథ్య బాధ్యతలు
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సెలబ్రేషన్ కమిటీ (2012) ప్రభుత్వ చైర్మన్‌గా సేవలు అందించిన అల్లంపల్లి రామకోటి ప్రతిభను, పోరాట పటిమను గుర్తించిన తెలంగాణ రక్షణ సేన అధినేత్రి, పార్టీ అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత.. ఆయనను పార్టీ బీసీ వింగ్ రాష్ట్ర చైర్మన్‌గా నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో సగం కన్నా ఎక్కువ ఉన్న బీసీల అభ్యున్నతికి ఈ నియామకం ఒక మైలురాయి నిలవనుంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కవితకు రామకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బడుగుల గొంతుకగా, అణచివేతకు వ్యతిరేకంగా అల్లంపల్లి రామకోటి ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరింత ఉధృత పోరాటాలు సాగనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9912693459

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments