Friday, July 31, 2026
Google search engine
Homeతెలంగాణ*బడుగుల గొంతుకై ఉప్పొంగుతున్న తెలంగాణ రక్షణ సేన..

*బడుగుల గొంతుకై ఉప్పొంగుతున్న తెలంగాణ రక్షణ సేన..

  • రాష్ట్ర బీసీ వింగ్ చైర్మన్‌గా అల్లంపల్లి రామకోటి నియామకం!
  • *సమాజ సంక్షేమమే ధ్యేయంగా ‘పంచజన్య’ అజెండా ప్రకటన
  • *ఉచిత విద్య, వైద్యం, సబ్సిడీ రుణాలు అందించి రాజ్యాధికారం సాధిస్తామని స్పష్టీకరణ

*హైదరాబాద్:
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా బడుగు, బలహీన వర్గాల, వెనుకబడిన తరగతుల జీవన ప్రమాణాలు నేటికీ మారలేదని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అత్యధికంగా ప్రాణాలర్పించి, త్యాగాలు చేసింది బీసీలేనని, నేడు ప్రభుత్వాలకు సింహభాగం పన్నులు చెల్లిస్తున్నది కూడా మెజారిటీ ప్రజలైన బీసీలేనని ఆమె స్పష్టం చేశారు.
శ్రమజీవులు పన్నులు కడుతుంటే, ఆ సంపదతో కొద్దిమంది మాత్రమే కోట్లకు ఎదిగిపోవడం ఏనాటి సామాజిక న్యాయమని ఆమె నిలదీశారు. కేవలం ఓటు బ్యాంకుగా మమ్ములను వాడుకుంటున్నారే తప్ప, బీసీల లెక్కలు తేల్చడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదని కవిత మండిపడ్డారు. ఈ అణచివేతను ఎదిరించి, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం అందించే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నారు.

‘పంచజన్య’ అజెండా – చారిత్రాత్మక వాగ్దానాలు
పేద ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం ‘పంచజన్య’ వేదికగా తెలంగాణ రక్షణ సేన విప్లవకరమైన భవిష్యత్ అజెండాను ప్రకటించింది:
1.ఉచిత విద్య: సామాన్య కుటుంబాల పిల్లల చదువులకయ్యే ఖర్చు భారాన్ని పూర్తిగా తొలగించి, ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య అందించడం.
2.ఉచిత వైద్యం: ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఏ వైద్యశాలకు వెళ్లినా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందేలా సంపూర్ణ భరోసా కల్పించడం.
3.ఆర్థికాభివృద్ధి & సబ్సిడీ రుణాలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన సమన్యాయం చేస్తూ, లక్ష రూపాయల నుండి ఇరవై కోట్ల రూపాయల వరకు సబ్సిడీ రుణాలు అందించి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేర్చడం.
ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ స్థాయి ఎన్నికల ఏదైనా సరే, యాభై శాతానికి పైగా టికెట్లను బీసీలకే కేటాయించి నిజమైన రాజ్యాధికారం అందించే ఏకైక నాయకురాలు కవిత అని అల్లంపల్లి రామకోటి కొనియాడారు.

అంకితభావంతో శ్రమిస్తా: అల్లంపల్లి రామకోటి
తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర బీసీ వింగ్ చైర్మన్‌గా తనను నియమించినందుకు అధినేత్రి కల్వకుంట్ల కవితకు రామకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతకు నూటికి నూరుపాట్లు న్యాయం చేస్తానని, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సమాజం పట్ల సంపూర్ణ నిబద్ధతతో పని చేస్తానని ఆయన శపథం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన తుది శ్వాస వరకు నిరంతరం శ్రమిస్తానని రామకోటి స్పష్టం చేశారు. కన్నతల్లిలా ఆదుకోవడానికి వస్తున్న కవిత వెన్నంటి నిలిచి, మన హక్కులను మనమే సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

అల్లంపల్లి రామకోటి రాష్ట్ర బీసీ వింగ్ చైర్మన్, తెలంగాణ రక్షణ సేన పార్టీ.:99126 93459

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments