ఎల్బీనగర్:
నాగర్ కర్నూల్ జిల్లా తెక్కపల్లి గ్రామ వాస్తవ్యుడు సందరాజు వెంకటయ్య మద్యం తాగుడు వలన వచ్చిన మతిమరుపుతో మాతా లక్ష్మి నగర్ లో ఉండే కుమారుడు రవీందర్ ఇంటి నుండి సోమవారం మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదని, అన్నీ చోట్లా వెతికినా జాడ తెలియలేదని ప్రైవేట్ ఉద్యోగం చేసే కొడుకు రవీందర్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారని సీఐ శ్రీశైలం తెలిపారు.


