శేరిలింగంపల్లి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం మియాపూర్ సర్కిల్-48 కార్యాలయంలో టౌన్ వెండింగ్ కమిటీ (టీవీసీ) సమావేశం నిర్వహించడం జరిగిందని ఉప కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ), పోలీస్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (పి ఓ) మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వీధి వ్యాపార జోన్ల గుర్తింపు, నియంత్రణ మరియు నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
వీధి వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం మరియు సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై కమిటీ సభ్యులు చర్చించడం జరిగిందని వారు తెలిపారు.


