శేరిలింగంపల్లి :మియాపూర్ సర్వే నంబర్ 100 భూములపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రశాంత్ నగర్ కాలనీ లో నివసిస్తున్న నివాసితులు పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగినది.ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా నివసిస్తున్నాం అని, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆందోళనకు కు గురవడం జరిగినది అని, మా అందరి సమస్య ను మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య ను పరిష్కరించి మాకు అండగా నిలవాలని PAC చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గాంధీకి వినతిపత్రం ద్వారా తెలియచేయడం జరిగినది అదేవిధంగా కాలనీ వాసులు మాట్లాడుతూ
ప్రభుత్వ అధికారుల తప్పులకు సామాన్య ప్రజలు బలికావాలా?
మియాపూర్ సర్వే నంబర్ 100 భూములపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని ఆవేదనతో కూడిన ప్రశ్నలు…
మియాపూర్ సర్వే నంబర్ 100 భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే, ఈ భూములను నమ్ముకుని తమ జీవితకాల కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టిన వేలాది సామాన్య కుటుంబాల పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి.
1954 నుంచి 1979 మధ్య కాలంలో రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులు, అవకతవకలకు బాధ్యులు ఎవరు? వాటిని అప్పటి ప్రభుత్వ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు?
ఒకవైపు రెవెన్యూ శాఖ భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను అనుమతించింది. మరోవైపు ప్రభుత్వ సంస్థ అయిన హుడా (హుడా) లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసింది.
ప్రభుత్వ శాఖలు ఇచ్చిన అనుమతులను నమ్మి 1993 ప్రాంతంలో ఎంతోమంది సామాన్యులు ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు.
వారిలో అధిక శాతం మంది సింగరేణి, హెచ్ఎంటీ, ఆల్విన్, హెచ్ఏఎల్, ఐడీపీఎల్, బీడీఎల్ ,హెచ్ ఎ ఎల్ వంటి సంస్థల్లో పనిచేసిన కార్మికులు, చిన్న ఉద్యోగులు, దిగువ మధ్యతరగతి కుటుంబాలవారే.
వారేమీ భూకబ్జాదారులు కాదు. భూముల చరిత్ర తెలియని సామాన్యులు. తమ జీతాల్లో నుంచి రూపాయి రూపాయి కూడబెట్టి, అప్పులు చేసి, పదవీ విరమణ ప్రయోజనాలను వెచ్చించి, తమ పిల్లలకు ఒక చిన్న ఇల్లు ఉండాలనే ఆశతో ప్లాట్లు కొనుగోలు చేసినవారు.
ప్రభుత్వ రికార్డులను నమ్మడం వారు చేసిన తప్పా? ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన అనుమతులను విశ్వసించడం నేరమా?
దశాబ్దాల తర్వాత ఆ భూములు ప్రభుత్వానివని తేలితే, వాటిని కొనుగోలు చేసిన అమాయకుల జీవితకాల పొదుపు పరిస్థితి ఏమిటి?
ప్రభుత్వ శాఖల స్థాయిలో జరిగిన తప్పులు, రికార్డుల అవకతవకలు, పర్యవేక్షణ లోపాలకు సామాన్య ప్రజలే మూల్యం చెల్లించాలా?
ఈ రోజు ఎంతోమంది కుటుంబాలు తమకు ఉన్న ఏకైక ఆస్తిని కోల్పోయే భయంతో ఉన్నాయి. కొందరికి సొంత ఇల్లు తప్ప మరో ఆధారం లేదు. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తి ప్రశ్నార్థకమైతే, ఆ కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఎవరు?
సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వ భూముల యాజమాన్యాన్ని నిర్ధారించింది. కానీ ప్రభుత్వ వ్యవస్థను నమ్మి భూములు కొనుగోలు చేసిన అమాయక ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే కాదా?
ప్రభుత్వం ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, అప్పటి రికార్డుల మార్పులు, అనుమతులు, రిజిస్ట్రేషన్లలో జరిగిన లోపాలను గుర్తించాలి. నిజమైన కొనుగోలుదారులను గుర్తించి, చట్టపరంగా సాధ్యమైన పరిహారం, ప్రత్యామ్నాయ స్థలాలు లేదా ఇతర న్యాయమైన పునరావాస మార్గాలను పరిశీలించాలి.
ప్రభుత్వ భూములను కాపాడటం ఎంత ముఖ్యమో, ప్రభుత్వ వ్యవస్థను నమ్మి తమ కష్టార్జితాన్ని కోల్పోయిన అమాయక కుటుంబాలను ఆదుకోవడం కూడా అంతే ముఖ్యం.
చివరిగా ఒకే ఒక్క ప్రశ్న…
నాడు ప్రభుత్వ అధికారుల తప్పిదాల కారణంగా నేడు వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తే, అదే ప్రభుత్వం వారికి న్యాయం చేయదా?
న్యాయస్థానం తీర్పును గౌరవిద్దాం… అమాయక కుటుంబాలకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూడాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ న్యాయస్థానం తీర్పు ను గౌరవించాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని, అమాయక కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రశాంత్ నగర్ కాలనీ వాసుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని, ఎవరు ఆందోళన చెందవద్దు అని ,మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు



