- అండగా ఉంటామని టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి భరోసా
- ప్రెస్ అకాడమీ నుంచి తగిన సహాయం కోసం కృషి
- శేఖర్ భౌతికయానికి నివాళులర్పించిన టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతలు
హైదరాబాద్
ప్రజాశక్తి, సూర్య దినపత్రికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సురాబాద్ లో జర్నలిస్టుగా పనిచేసినటువంటి భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆదివారం రాత్రి ఆకస్మిక మృతి. శేఖర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణ, తెలంగాణ రాష్ట కౌన్సిల్ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ జే.కిషన్(రాధా కిషన్), జిల్లా సంయుక్త కార్యదర్శి బోల్లంపల్లి ఆంజనేయులు, ట్రెజరర్ శశిపాల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు బాణాల మధుసూదనాచారి, చాపల శ్రీనివాస్,దేవయ్య,దుర్గయ్య తదితరులు శేఖర్ భౌతికకాయంపై పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి, కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్తులో శేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని ఐజేయు నేతలు కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు.


