Wednesday, October 28, 2026
Google search engine
Homeతెలంగాణయువతే విపత్తుల్లో ఆపద్భాంధవులు -యువ ఆపదమిత్ర శిక్షణ ప్రారంభం....

యువతే విపత్తుల్లో ఆపద్భాంధవులు -యువ ఆపదమిత్ర శిక్షణ ప్రారంభం….

కొండాపూర్ 8వ పోలీస్ బేటాలియన్ కామండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి.

శేరిలింగంపల్లి:

కొండాపూర్ 8వ పోలీస్ బెటాలియన్ టి జి ఎస్ p, కొండాపూర్ లో ఎస్ డి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో మెదక్, నర్సాపూర్ , సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 68 మంది కళాశాల విద్యార్థులకు వారం రోజుల “యువ ఆపదమిత్ర” శిక్షణ కార్యక్రమాన్ని బెటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరదలు, అగ్నిప్రమాదాలు, భవనాలు కూలడం, రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స, శోధన-రక్షణ, రెస్క్యూ పరికరాల వినియోగంపై ఎస్ డి ఆర్ ఎఫ్, సిబ్బంది ప్రాయోగిక శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు.

యువతలో సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించడమే ఈ పథకం ఉద్దేశమని, విపత్తుల్లో శిక్షణ పొందిన యువత పోలీస్, SDRF బృందాలకు ఆపద్భాంధవులుగా నిలుస్తారని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు రక్షణ కిట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎం. జయరాజు, SDRF వింగ్ అసిస్టెంట్ కమాండెంట్ డి. సత్యనారాయణ, ఆర్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments