Friday, October 23, 2026
Google search engine
Homeతెలంగాణరంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం..

రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం..

అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా పరిధిలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని శంషాబాద్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది.
ఈ కీలక సమావేశానికి రాష్ట్ర పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ప్రభుత్వ సంక్షేమ పాలనకు పట్టం కట్టాలి: మంత్రి శ్రీధర్ బాబు:
ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ సాక్షిగా పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పాలనకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తూ, విద్యావంతులు మరియు ఉద్యోగులు సామ రామ్మోహన్ రెడ్డికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో క్షేత్రస్థాయిలో సన్నద్ధం కావాలని నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మండల మరియు డివిజన్ స్థాయి కమిటీలను తక్షణమే పూర్తి చేసుకొని, పార్టీని బలోపేతం చేస్తూ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని సూచించారు.

*హాజరైన ప్రముఖులు
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఏఐపీసీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, శాసనమండలి సభ్యులు బల్మూరీ వెంకట్, శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మనోహర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి పాల్గొన్నారు.

అలాగే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు దార సింగ్ జాదవ్, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పీసీసీ నాయకులు, జిల్లా నాయకులు, మండల మరియు డివిజన్ అధ్యక్షులు, వివిధ కమిటీల సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments