Saturday, November 14, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్రు. 530 కోట్లతో ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణం.....

రు. 530 కోట్లతో ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణం…..

  • మియాపూర్ చౌరస్తా నుండి ఆల్విన్ చౌరస్తా వరకు నిర్మించబోయే ఫ్లైఓవర్ అండర్పాస్ నిర్మాణ పనుల పరిశీలన….
  • పిఎసి, చైర్మన్ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ.

శేరిలింగంపల్లి :మియాపూర్ చౌరస్తా నుండి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రూ. 530.00 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మించబోయే 6 లేన్ బై డైరెక్షనల్ , 1790 ఎం పొడవు ఫ్లై ఓవర్ , 24 మీటర్ల వెడల్పు హఫీజ్ పెట్ నుండి మియాపూర్ వరకు 3 లెన్ యూని డైరెక్షనల్ అండర్ పాస్ మరియు బాచుపల్లి నుండి ఆల్విన్ చౌరస్తా వరకు 3 లెన్ యూని డైరెక్షనల్ అండర్ పాస్ ఫ్లై ఓవర్ నిర్మాణము పనులలో భాగంగా ఇంద్రారెడ్డి ఆల్విన్ చౌరస్తా నుండి హఫీజ్పేట్ వైపు నిర్మించబోయే అండర్ పాస్ మరియు రోడ్డు విస్తరణ పనుల కై తీసుకోవాల్సిన చర్యల పై సిఎంసీ కమిషనర్ సృజన ఐఏఎస్ , జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మలెంపాటి, డీసీ, శ్రీనివాస్, బాలకృష్ణ, సీసీపీ వెంకన్న, మరియు సిఎంసీ ప్రాజెక్ట్స్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన పిఎసి చైర్మన్, శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా పి ఎ సి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, హెచ్ -సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆల్విన్ చౌరస్తా నుండి హఫీజ్‌పేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) వరకు ప్రతిపాదించిన 200 అడుగుల రహదారి నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే ఆస్తులను కూడా అధికారులు పరిశీలించారు. ప్రతిపాదిత రహదారి వెడల్పును 200 అడుగుల నుంచి 160 అడుగులకు తగ్గించే అంశంపై సాధ్య సాధ్యల పై చర్చించడం జరిగినది అని తెలియచేశారు.

సవరించిన రహదారి అలైన్‌మెంట్ ప్రకారం టౌన్ ప్లానింగ్ మరియు ఇంజినీరింగ్ విభాగాల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, ప్రభావిత ఆస్తుల యజమానులకు నవంబర్ 15 లోపు నోటీసులు అధికారులు జారీ చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, ప్రతిపాదిత మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన చేపట్టేందుకు (వెహికలర్ అండరపాస్ ) భాగం వరకు భూసేకరణ ప్రక్రియను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని అధికారులకు సూచించారు.

ప్రాజెక్టు అమలులో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అవసరమైన అన్ని ప్రక్రియలను వేగవంతం చేయాలని తెలియచేశారు.

మియాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణం, అండర్ పాస్ వలన రోడ్డు పక్కన ఉన్న ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎవరు అధైర్య పడకూడదు అని,ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యంగా నష్టపరిహారం వచ్చేలా చూస్తాననీ, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని, అందరికీ టీడీఆర్ అందేలా చూస్తామని, అందరికీ ఆమోదయోగ్య విధంగా మియాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని తెలియచేశారు.

ప్రజా అవసరాల దృష్ట్యా ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని, నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా , ట్రాఫిక్ రహిత సమాజం కోసం, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫ్లై ఓవర్ ను నిర్మించడం జరుగుతుంది అని, ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరు సహకరించాలని,,రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణం వలన ట్రాఫిక్ కష్టాలు తప్పునని, సమయం, ఇంధనం ఆదా అవునని ,ప్రజలకు సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిఈ శ్రీలక్ష్మి ,ఈఈ గోపాల్ డిఈ వరుణ్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుష్మా , డిఈ శ్రీదేవి , ఎఈ ప్రతాప్ మరియు నాయకులు,కార్యకర్తలు ఇంద్రారెడ్డి రెడ్డి ఆల్విన్ కాలనీ వాసులు ,స్థానికులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments