ఎల్బీనగర్
బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్లో త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు రూ.85 లక్షల నిధులతో నూతన అంగన్వాడీ భవనం, ప్రాథమిక పాఠశాలకు అదనపు గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. చిన్నారులకు అంగన్వాడీ స్థాయి నుంచే మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదులను నిర్మించడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎన్. రెడ్డి.నగర్ డివిజన్ భారాస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, మనోజ్, సతీష్ చౌదరి, మహేష్, శ్రీకాంత్ రెడ్డి, సంతోష్ రావు, నరేష్, రాజు యాదవ్, స్కూల్ ప్రిన్సిపాల్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.


