Friday, October 16, 2026
Google search engine
Homeతెలంగాణవైశాలి నగర్ కాలనీ లో గల రైల్వే అండర్ పాస్ ను ప్రారంభం....

వైశాలి నగర్ కాలనీ లో గల రైల్వే అండర్ పాస్ ను ప్రారంభం….

పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ గారు.

శేరిలింగంపల్లి
హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ కాలనీ లో గల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రూ. 70 లక్షల రూపాయల అంచనావ్యయంతో జరుగుతున్న వరద నీటి కాల్వ నిర్మాణం మరియు సీసీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తయిన శుభసందర్భంగా రైల్వే అండర్ పాస్ ను జోనల్ కమిషన్ నారాయణ్ అమిత్ మాలెం పాటి, డీసీ సేవా ఇస్లావత్, ట్రాఫిక్ ఏసీపీ ఆదిమూర్తి, ట్రాఫిక్ సీఐ నర్సింహ రెడ్డి, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి మరియు సిఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రారంభించిన పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మంజీరా పైప్ లైన్ రోడ్డు నుండి మసీదు బండ కు వెళ్లే రోడ్డు లో గల రైల్వే అండర్ పాస్ రోడ్డును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని, నేటి తో ట్రాఫిక్ కష్టాలు తీరునని, ప్రజలకు సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేయడం జరుగుతుంది అని, నేటి నుండి సులభతరంగా 2 వాహనాలు ప్రయాణించే విధంగా అండర్ పాస్ ను తీర్చిదిద్దడం జరిగిన్నారు. రైల్వే అండర్ పాస్
వద్ద నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ఉదయం , సాయంత్రం మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అని, ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని రూ. 70 లక్షల రూపాయలతో వరద నీటి కాల్వ నిర్మాణం పనులు మరియు సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడం జరిగినది అని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని, పనులు త్వరితగతిన పూర్తి చేసి నేటి తో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. చుట్టుపక్కల కాలనీల వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని, శాశ్వత పరిష్కారం దిశగా అన్ని రకాల చర్యలును తీసుకోవాలని, పక్కా ప్రణాళికలు వేసుకొని పనులు ప్రారంభించడం జరిగినది అని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా అండర్ పాస్ ను తీర్చిదిద్దడం జరిగినది అని ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలియచేశారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, వరద నీటి కాల్వ నిర్మాణం పనులను, సీసీ రోడ్డు నిర్మాణం పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టడం జరిగినది అని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగినది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎస్ ఈ శంకర్ నాయక్,ఈఈ శిరీష, డిఈ ఆనంద్, ఎఈ. భాస్కర్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments