శేరిలింగంపల్లి
మాదాపూర్ డివిజన్ లోని ఇజ్జత్ నగర్ కాలనీలో జగత్ జనని టీమ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన శ్రీ దుర్గామాత పూజా కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు, బీజేపీ మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజనిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, భక్తులకు అన్నప్రసాదం అందించే పవిత్ర సేవలో భాగస్వాములయ్యారు. భక్తి, సేవాభావం, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకగా నిలిచే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమంలో bjp ముఖ్య నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, ఇజ్జత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి, నరేష్ రెడ్డి, కురుమయ్య, పవన్ రెడ్డి, సుధాకర్, ఆనంద్, కుమార్, సురేష్, నవీన్, బాలమ్మ, చెన్నమ్మ, మెగాన్సు యాదవ్, నిఖిల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం అందించారు.


