మాదాపూర్ :కేబుల్ బ్రిడ్జ్ పై నుండి దుర్గం లోకి దూకి ఆత్మహత్య చేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కే వి సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం
ఏడుబిల్లి రాజేష్ (25) మాదాపూర్లోని కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ నాచారంలో నివాసం ఉంటున్నాడు.
సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల మధ్య రాజేష్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న తన స్నేహితుడి గదికి వెళ్లి మద్యం సేవించినట్లు తెలిసింది. అనంతరం మంగళవారం ఉదయం సుమారు 06:30 గంటలకు తన స్నేహితుడితో కలిసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లాడు., ఆ తరువాత అతను కనిపించకుండా పోయినట్లు సమాచారం. అతని స్నేహితులు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.
కనిపించకుండా పోయడు. చుట్టు పక్కల వెతికిన రాజేష్ ఆచూకీ దొరకలేదు. కాగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో దుర్గం చెరువులో వెతకడంతో రాజేష్ శవం అభ్యం అయినాదన్నారు. ఈ మేరకు రాజేష్ అక్క ఏడుబెల్లి సంధ్యారాణి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు.


