Saturday, August 15, 2026
Google search engine
Homeతెలంగాణస్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌...

స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లా*

  • తెలంగాణ ప్రజలకు గవర్నర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్‌:

ఈ నెల 15 వ తేదీన దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లా దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ధైర్యసాహసాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని గవర్నర్‌ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, సమగ్రతను పరిరక్షించేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణానికి కృషి

భారత్‌ను మరింత బలమైన, స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర్‌ భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని శ్రీ శివప్రతాప్‌ శుక్లా కోరారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందేలా శాంతి, సౌభ్రాతృత్వం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
ఐక్యతతోనే అభివృద్ధి
ఐక్యత, సమగ్రత, అభివృద్ధి స్ఫూర్తితో ఉజ్వల భారతావని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. దేశ ప్రగతిలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ గర్వంగా రెపరెపలాడాలని, దాని మూడు రంగులు దేశ ప్రజల్లో ధైర్యం, శాంతి, విశ్వాసానికి ప్రతీకలుగా నిలవాలని గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లా ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి పునరంకితం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments