Monday, August 24, 2026
Google search engine
Homeతెలంగాణహైదరాబాద్‌ రేస్‌క్లబ్‌ గవర్నర్స్‌ ట్రోఫీ విజేత ‘వన్‌ అండ్‌ ఓన్లీ’

హైదరాబాద్‌ రేస్‌క్లబ్‌ గవర్నర్స్‌ ట్రోఫీ విజేత ‘వన్‌ అండ్‌ ఓన్లీ’

  • విజేతకు ట్రోఫీ అందజేసి అభినందించిన గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌:

హైదరాబాద్‌ మలక్‌పేటలోని హైదరాబాద్‌ రేస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన హైదరాబాద్‌ మాన్‌సూన్‌ రేసెస్‌–2026లో ప్రధాన ఈవెంట్‌గా జరిగిన ది గవర్నర్స్‌ ట్రోఫీ (1,200 మీటర్లు)ను ‘వన్‌ అండ్‌ ఓన్లీ’ గుర్రం కైవసం చేసుకుంది. జాకీ అక్షయ్‌ కుమార్‌ రైడింగ్‌లో ‘వన్‌ అండ్‌ ఓన్లీ’ విజయం సాధించింది.

హైదరాబాద్‌ రేస్‌క్లబ్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ హోదాలో గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా గవర్నర్ బాక్స్ నుంచి
మాన్‌సూన్‌ రేసెస్‌–2026కు హాజరై పోటీలను తిలకించారు. పోటీలు అధ్యాంతం ఉత్సాహంగా సాగాయి.

అనంతరం గవర్నర్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన ‘వన్‌ అండ్‌ ఓన్లీ’ గుర్రం యజమానులు శ్రీ రామశేషు ఎయ్యున్ని, శ్రీ శంకర్‌ శ్రీనివాస్‌, శ్రీ అశోక్‌ రణ్‌పిసే, శ్రీ డొనాల్డ్‌ ఆంథోనీ నెట్టో, జాకీ అక్షయ్‌ కుమార్‌, ట్రైనర్‌ డి. నెట్టోలకు గవర్నర్‌ ట్రోఫీని అందజేసి అభినందించారు.

అంతకుముందు క్లబ్ చరిత్రను హైదరాబాద్‌ రేస్‌క్లబ్‌ ప్రతినిధులను వివరించారు. క్లబ్ మ్యూజియంను సందర్శించారు.

కార్యక్రమంలో హైదరాబాద్‌ రేస్‌క్లబ్‌ చైర్‌పర్సన్‌ ఆర్‌. సురేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments