Tuesday, November 11, 2025
Google search engine
Homeతెలంగాణఅక్టోబర్ 31న సిసిఐ కొనుగోలు కేంద్రాలు..

అక్టోబర్ 31న సిసిఐ కొనుగోలు కేంద్రాలు..

ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్.., మార్కెటింగ్ అధికారి..
వ్యవసాయ మార్కెట్ కమిటీ, మద్నూర్, ఆధ్వర్యంలో 7 జిన్నింగ్ మిల్లులు..

వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్నూర్ జిల్లా కామారెడ్డి ఆధీనంలో 7 జీన్నింగ్ మిల్లులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫికేషన్ చేసి ఉన్నారు. కానీ స్లాట్ బుకింగ్ ద్వారా సిసిఐ వారి ఎల్ 1 ప్రకారం ఒక మిల్లు కెపాసిటీ వరకు ఆ మిల్లు మాత్రమే కనబడుతుంది. అక్కడికి తీసుకుని వెళ్ళాలి.

సిసిఐ ద్వారా పత్తిని అమ్మకమునకు తీసుకొని వచ్చే రైతు సహోదరులకు తెలియజేయునది ఏమనగా, పత్తి యొక్క తేమ 8% నుంచి 12 % నకు మించి ఉండరాదు. పత్తి యొక్క పింజ రకాన్ని బట్టి 50రూ. తేమ శాతాన్ని బట్టి 81_82 రూ. రేటు తగ్గుతుంది. కావున ఇది రైతులు గమనించగలరు. కావున పత్తి అమ్ముకోవడానికి వచ్చే రైతులు పత్తిని తమ కల్లాల వద్దనే ఆరబెట్టుకుని తీసుకొని రావాల్సిందిగా విన్నపము.

సీసీఐ కేంద్రానికి అధిక తేమశాతంతో పత్తిని తీసుకొని వచ్చి రైతులు ఇబ్బంది పడవద్దని కోరుచున్నాము. అకాల వర్షాల కారణంగా ముందుగానే ప్రారంభించవలసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలను తేదీ 31 అక్టోబర్ శుక్రవారం రోజున ప్రారంభించబడుతుందని తెలుపుచున్నాము.

రైతులు తాము పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రానికి అమ్మకానికి తీసుకువచ్చే రైతులు /కౌలు రైతులు ముందుగా వ్యవసాయ అధికారులను సంప్రదించి కిసాన్ యాప్ లో వ్యవసాయ అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా రైతులు ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకొని, ఈ కిసాన్ కపాస్ యాప్ నందు ముందుగానే పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ను జత చేయవలసి ఉంటుంది . ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకున్న తేదీ రోజున అనివార్య కారణాల చేత పత్తిని అమ్ముకోవడానికి రాని ఎడల తిరిగి అదే రోజు స్లాట్ బుకింగ్ క్యాన్సల్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సౌకర్యం రైతు సహోదరులకు మూడు పర్యాయాలు ఉంటుంది. కానీ మూడు పర్యాయాలు ముగిసిన అనంతరం రైతుల స్లాట్ బుకింగ్ నిలిపివేయబడుతుంది. తిరిగి చేసుకోవాలంటే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించిన పిదపనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని కామారెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి పి. రమ్య, తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments