Thursday, July 17, 2025
Google search engine
Homeఇంటర్నేషనల్అట్టుడుకుతున్న పాకిస్థాన్..

అట్టుడుకుతున్న పాకిస్థాన్..

తీవ్రతరమైంది పీటీఐ కార్యకర్తల ఆందోళన..
ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి..

మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల ఆందోళనతో పొరుగుదేశం పాకిస్థాన్‌ అట్టుడుకుతోంది. జైల్లో ఉన్న మాజీ ప్రధానిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పీటీఐ కార్యకర్తలు లక్షలాది మంది దేశ రాజధాని ఇస్లామాబాద్‌ వైపు మార్చ్‌ నిర్వహించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ భార్య బుష్రా బీబీ, ఖైబర్‌ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్‌ ఈ కవాతుకు నేతృత్వం వహించారు.

ఈ మార్చ్‌ సందర్భంగా రాజధానిలో ఉద్రిక్తతత చోటు చేసుకుంది. లక్షలాదిగా తరలివస్తున్న నిరసనకారులను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ మద్దతుదారుల నిరసనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా, ఇమ్రాన్‌ను విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు ఆదివారం ఇస్లామాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధమైన విషయం తెలిసిందే. బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ పిలుపునిచ్చింది.ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు తమ పార్టీ ఇతర నాయకులను జైళ్ల నుంచి విడుదల చేయాలని, ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నుంచి దొంగిలించిన మెజారిటీని పునరుద్ధరించాలని, ఉన్నత స్థాయి జడ్జీల నియామకంలో చట్టసభల సభ్యులకు గల అధికారులను పునరుద్ధరించాలని పీటీఐ డిమాండ్‌ చేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. ఇస్లామాబాద్‌లో ఆదివారం భారీగా భద్రతా దళాలను మోహరించింది. రోడ్లను మూసివేసి, మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది.

నిరసనకారులు రాజధానిలోకి ఎంటర్‌ కాకుండా ప్రభుత్వం హైవేలను సైతం మూసివేసింది. రహదారులకు అడ్డంగా కంటెయినర్లు, కాంక్రటీట్‌ పరికరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసింది. అయితే, నిరసనకారులు వాటిని తొలగించి ముందుకు చొచ్చుకొచ్చారు. ఇది హింసాత్మక ఘటనలను దారితీసింది. ఫలితంగా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ఇస్లామాబాద్‌ సమీపంలో, పంజాబ్‌ ప్రావిన్స్‌ అంతటా జరిగిన ఘర్షణల్లో కనీసం 119 మంది గాయడప్డారు. 22 పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇద్దరు అధికారుల పరిస్థితి విషమయంగా ఉన్నట్లు ప్రావిన్షియల్‌ పోలీసు చీఫ్‌ ఉస్మాన్‌ అన్వర్‌ తెలిపారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు కూడా గాయాలైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం పాక్‌లో హైటెన్షన్‌ కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments