ఎల్బీనగర్:
80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ – కూకట్ పల్లి ప్రేకాస స్టూడియోలో ప్రతిష్టాత్మక వంశీ ఇంటర్నేషనల్ – వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్కృతి, సాహితీ, కళా, సమాజ సేవా రంగాలలో సేవలు అందించిన ప్రముఖులకు వంశీ వందే భారత్ అవార్డులు అందచేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శతాధిక చిత్రాల ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ కు ” వంశీ వందే భారత్” అవార్డును అందచేశారు. వంశీ ఇంటర్నేషనల్ – వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా అనాథ విద్యార్థులను అక్కున చేర్చుకొని,వారికి ఉచిత భోజన, వసతి, అన్ని విద్యా సౌకర్యాలు కల్పించి వారికి ప్రైవేట్ పాఠశాలలలో , కళాశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పించి, మంచి భవిష్యత్తుకు అహర్నిశలు కృషి చేస్తున్నoదుకు అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ ను వంశీ వందే భారత్ అవార్డుకు ఎంపిక చేశామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ప్రేకాస స్టూడియో అధినేత సబిత, వంశీ ఇంటర్నేషనల్ మేనేజింగ్ ట్రస్టీ శైలజ, ప్రొఫెసర్ కేవిఆర్ మూర్తి హాజరైనారు.



