ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసిన విశ్వకర్మ సంఘం ప్రతినిధులు
అబ్దుల్లాపూర్‌మెట్:
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో విశ్వకర్మ కులస్తుల సంక్షేమం, ఐక్యత కోసం నూతన కమిటీ హాల్ (సమావేశ భవనం) నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది. ఇందులో భాగంగానే మండల విశ్వకర్మ కులస్తులు పెద్ద సంఖ్యలో కదిలివచ్చి ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ బి-బ్లాక్ అధ్యక్షులు సి.హెచ్. భాస్కరాచారి ఆధ్వర్యంలో సుమారు 150 మంది విశ్వకర్మ కుల బాంధవులు ఈ కార్యక్రధంలో పాల్గొని శాసనసభ్యులను కలిసి తమ సమస్యను వివరించారు. కులస్తుల సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలంతో కూడిన భవనం లేకపోవడంతో పడుతున్న ఇబ్బందిని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.
స్పందించిన శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి తక్షణమే సానుకూలంగా స్పందించారు. భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి కేటాయించాలని అబ్దుల్లాపూర్‌మెట్ సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మాజీ ఎం.పి.పి. బుర్ర రేఖ మహేందర్‌గౌడ్, బుర్ర చంద్రంగౌడ్, వార్డు సభ్యులు మహేందర్ తదితరులను కూడా విశ్వకర్మ కులస్తులు కలిసి తమ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
ఈ విశేష కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సి.హెచ్. భాస్కరాచారి, యు. మధుసూదనాచారి, వి. రాజేంద్రాచారి, ఎస్. రాజమౌళిచారి, వి. చంద్రయ్యచారి, ఎస్. సత్తయ్యచారి, ఎస్. సురేంద్రాచారి, దినేష్‌చారి, కృష్ణచారి, శ్రవణ్‌చారితో పాటు దాదాపు 150 మంది విశ్వకర్మ కులస్తులు పాల్గొన్నారు.



