బాడ్మింటన్ ఒలింపిక్ పతకాల విజేత, ప్రపంచ మాజీ ఛాంపియన్ పి.వి. సింధు పెళ్లి కూతురు కాబోతోంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని ఆమె ఈ నెల 22న పెళ్లిచేసుకోనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరుగుతుంది. ‘‘మా రెండు కుటుంబాలకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. కానీ నెల కిందటే పెళ్లి ఖరారు చేసుకున్నాం. జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడబోతోంది. అందుకే డిసెంబరు 22న పెళ్లి వేడుకకు ముహూర్తం నిర్ణయించాం. 24న హైదరాబాద్‌లో విందు ఉంటుంది’’ అని పీవీ సింధు తండ్రి పీవీ రమణ మీడియాకు తెలిపారు. ఈ నెల 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి.
ఈ నెల 22న వివాహం చేసుకోనున్న పీవీ సింధు.
RELATED ARTICLES