Home తెలంగాణ ఈ నెల 28 న ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం

ఈ నెల 28 న ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం

0
6

ఎల్బీనగర్

ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కేంద్ర కార్యవర్గ సమావేశం ఈనెల 28వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణం రాజు రవికుమార్ జాతీయ ఉపాధ్యక్షులు తెలంగాణ ఇన్చార్జి నైషధం సత్యనారాయణమూర్తిలు మాట్లాడుతూ తెలిపారు. సోమవారం నాడు వారు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈనెల 28వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నట్టి సమస్యల మీద జాతీయ స్థాయిలో బ్రాహ్మణ ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు, బ్రాహ్మణులకు రాజకీయ, సామాజిక రంగాలలో, గుర్తింపు తదితర అంశాల మీద సుదీర్ఘ చర్చ జరుపుతారని వారు తెలిపారు. జాతీయ కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ సమావేశానికి కేంద్ర కమిటీ సభ్యులందరూ హాజరు అవుతారని అదేవిధంగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణు గోపాల చార్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు నారపరాజు రామ చందర్రావు మాజీ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి జస్టిస్ శివశంకర్ ఎమ్మెల్సీలు గిడుగు రుద్రరాజు, వాణి దేవి తదితరుల బ్రాహ్మణ నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘ చర్చ ఈ సమావేశంలో జరుగుతుందని తెలిపారు. ఇంకా సమావేశంలో చింతపల్లి మంగపతి రావు, వారణాసి వంశీ తదితర బ్రాహ్మణ సమాజ నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here