లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ రవికుమార్
ఎల్బీనగర్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకునే సదుద్దేశంతో అర్హులైనటువంటి నిరుపేదలకు వివిధ రకాల పింఛన్ల పంపిణీ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుట్ర పూరిత రాజకీయాలతో అలజడి సృష్టించడమే కాకుండా ఇష్టానుసారంగా దూషించినట్లు ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ ఊరుపక్క రవికుమార్ సంచల ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే బెదిరింపు ధోరణితో తీవ్ర ఆవేదనకు గురైన తాము శుక్రవారం సాయంత్రం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం మీడియా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన చంపాపేట్ లో ప్రభుత్వ ఎంఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పేదలకు పింఛన్ల పంపిణీని కార్యక్రమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని అడ్డుకొని, మహిళలు వికలాంగులు, చిన్నారులు, వితంతువులను భయభ్రాంతులకు గురయ్యాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సృష్టించినటువంటి అలజడి బెదిరింపులపై సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ఎల్బీనగర్ ప్రజలను ఎమ్మెల్యే కుట్రపూరితంగా రౌడీ మూకలను తీసుకువచ్చి అధికారులు, పోలీస్ లను బెదిరించిన సుధీర్ రెడ్డి, ఆయన అనుచరులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ ప్రెసిడెంట్ డేరంగుల కృష్ణ, చింతలకుంట డివిజన్ చైర్మన్ బాలకృష్ణ, గడ్డి అన్నారం డివిజన్ చైర్మన్ అనసూయ శాంతి, హస్తినాపురం డివిజన్ చైర్మన్ షాగా శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.



