Thursday, November 5, 2026
Google search engine
Homeతెలంగాణక్రిస్టియన్ యువతులపై దాడిని ఖండించిన సిపిఎం పార్టీ ప్రతినిధులు

క్రిస్టియన్ యువతులపై దాడిని ఖండించిన సిపిఎం పార్టీ ప్రతినిధులు

ఎల్బీనగర్:

అల్మాస్ గూడలో క్రిస్టియన్ యువతులపై దాడి చేసిన వారిని పోలీసు అధికారులు వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ప్రెస్ విలేకరులతో సిపిఎం పార్టీ ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ బడంగ్ పేట సర్కిల్ అల్మాస్‌గూడ, మారుతీ నగర్ ప్రాంతంలో బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు యువతులపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అత్యంత దారుణంగా దాడి చేస్తున్న వీడియో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది.
బైబిల్ కరపత్రాలు పంపిణీ చేయడం వారి మత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా తెలియజేయాలి కానీ, మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.ఈ ఘటనపై నగర పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మత స్వేచ్ఛను, మహిళల గౌరవాన్ని కాపాడాలి. లేనియెడల మహిళలను, ప్రజాసంఘాలను కదిలించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని, నగర పోలీస్ అధికారులను హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments