ఎల్బీనగర్
కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం ఆవరణలో ఆదివారం “ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్” ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉత్తర భారతీయ సోదర సోదరీమణులు ఆచరిస్తున్న ఛట్ పూజ దేశం యొక్క సమగ్ర సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అని అన్నారు.సూర్యుని ఆరాధించే ఈ పూజలో భక్తులు నది తీరాల వద్ద ఉపవాస దీక్షలు,పండ్ల నైవేద్యాలు సమర్పించడం ద్వారా కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సంస్కారం ఉందని పేర్కొన్నారు.సూర్య దేవుడు, ఉషోదయ పూజ, అష్టమి పర్వదినాల విశిష్టతను గుర్తుచేస్తూ భక్తుల ఆరోగ్యం, సుఖశాంతి,కుటుంబ సుభిక్షత,రాష్ట్ర అభ్యున్నతి కోసం ప్రార్థించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నివసిస్తున్న ఉత్తర భారతి ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ మాజీ ధర్మకర్త మధుసాగర్, ఆలయ సిబ్బంది ప్రసాద్, ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్ సభ్యులు ఎన్.కే.సింగ్, సంఘ్ పరివార్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


