Thursday, November 12, 2026
Google search engine
Homeతెలంగాణచెరుకు తోట కాలనీ సీసీ రోడ్డు పనులను అధికారులతో కలిసి పరిశీలించిన సంక్షేమ సంఘం నాయకులు

చెరుకు తోట కాలనీ సీసీ రోడ్డు పనులను అధికారులతో కలిసి పరిశీలించిన సంక్షేమ సంఘం నాయకులు

ఎల్బీనగర్:

సరూర్నగర్ డివిజన్ చెరుకు తోట కాలనీ రోడ్ నెంబర్ 3 ప్రధాన రహదారిని ఎంఎంసీ సర్కిల్ అధికారులు కాలనీ వాసులతో కలిసి రోడ్డు నిర్మాణం వలన రోడ్డుతో పాటు పక్కన ఉన్న ఫుట్ పాతులు, డ్రైనేజీ లైన్లు, వాటర్ లైన్లకు ఇబ్బంది కలగకుండా కాలనీ ప్రజల అపోహలను అధికారుల సమక్షంలో చర్చించి, ఎవరికి ఇబ్బంది కలుగకుండా సిసి రోడ్డు పనులను సాఫీగా జరిగే విధంగా సర్కిల్ అధికారులు ద్వారా అపోహలను నివృత్తి చేస్తూ, దాదాపు రెండు గంటల పాటు కాలనీ ప్రధాన రహదారి గుండా పర్యటిస్తూ, పాత విధానంలో 5.1/2..మీటర్లు.19 ఫీట్లు కాకుండా, నూతనంగా 7 మీటర్లు 21 ఫీట్ల రోడ్డు రోడ్డును వేయాలని రెండవ బిట్టు మోహనా చారి ఇంటి దగ్గర నుండి, చెరుకు తోట కాలనీ టర్నింగ్ పాయింట్ వరకు వేసే రోడ్డుకు కూడా వెంటనే శాంక్షన్ ఇస్తామని సరూర్నగర్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్తీక్ డీఈఈ విజయ్ కుమార్, ఏఈ ప్రశాంతి కాలనీవాసులకు హామీ ఇచ్చారు. చెరుకు తోట కాలనీ రోడ్ నెంబర్ 3 కేపిఎన్ ఫ్రెష్ నుండి కాలనీ టర్నింగ్ పాయింట్ వరకు రోడ్డు నిర్మాణం పెట్టి, పరిస్థితులు ఇబ్బంది కలగకుండా పూర్తి చేయాలని చెరుకు తోట కాలనీ నార్త్ పోచమ్మ బాగ్ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ సందర్భంగా బేర బాలకిషన్.(బాలన్న ) లోకసాని కొండల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి. ఆర్ కే సంతోష్, అంజయ్య గుప్తా, నారాయణస్వామి, రావిరాల సంధ్యారాణి, సుదర్శన్ గుప్త ,చింతకింది రంజిత్, తునికి పద్మాకర్, తాండ్ర భాస్కర్ లు అధికారులను కోరగా రోడ్డు వేయించే బాధ్యత మేము తీసుకుంటామని జోనల్ కమిషనర్ వికాస్ మహాతోతో వెంటనే అప్రూవల్ తీసుకుంటామని సరూర్నగర్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్తీక్ అందరి సమక్షంలో హామీ ఇచ్చారు.రెండు రోజుల్లో పనులు మొదలు పెడతామని అధికారులు కాలనీవాసులకు తెలియజేశారు. దీనికి అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments