ఎల్బీనగర్:
చేయూత పెన్షన్ పొందేందుకు అర్హులైన లబ్ధిదారులు తమ దరఖాస్తులను సమీపంలోని మీ-సేవ కేంద్రాల్లో ఆన్లైన్ చేసుకోవాలని ఎల్బీనగర్ సర్కిల్-13 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఇరువురు ఒక ప్రకటనలో తెలిపారు.చేయూత పెన్షన్‌కు సంబంధించిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ మీ-సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సమీపంలోని మీ-సేవ కేంద్రానికి వెళ్లి తమ పెన్షన్ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.


