జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ …ఎస్.పి కిరణ్ ఖరే….
పలు అంశాలపై సమీక్ష..
జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్ సి.హెచ్.రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్.పి. కిరణ్ కారే శనివారం భేటీ అయ్యారు. అండర్ ట్రయల్ ప్రిసెనెర్లు, ఇతర అంశాలపై సమీక్షించారు. న్యాయ, పరిపాలన, రక్షణ పరమైన అంశాలపై కలెక్టర్, ఎస్.పి. లకు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగారు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్, సి.ఐ. నరేష్ కుమార్, స్పెషల్ పి. పి. ఎన్.విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


