Saturday, November 7, 2026
Google search engine
Homeతెలంగాణడాక్టర్స్ కాలనీలో కుంగిన రోడ్డు.. ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్!

డాక్టర్స్ కాలనీలో కుంగిన రోడ్డు.. ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్!

  • మ్యాన్‌హోల్‌తో పాటు రోడ్డు కూడా కుంగిపోయిన వైనం
  • నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే మళ్లీ రోడ్డు కుంగిపోయే ప్రమాదం
  • ఎంఎంసీ అధికారులు వెంటనే పరిశీలించాలని కాలనీ వాసుల విజ్ఞప్తి

ఎల్బీనగర్,

డాక్టర్స్ కాలనీ రోడ్ నంబర్ 4లో డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ తో పాటు రోడ్డు సైతం కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్‌హోల్ నిర్మాణ పనులు చేపట్టినా, రోడ్డు కుంగిన ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి మరమ్మతులు చేయకపోతే తిరిగి రోడ్డు దిగబడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ తవ్విన గుంతలు వాహనదారులు, పాదచారులకు ప్రమాదకరంగా మారింది. సంబంధిత ఎంఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా రోడ్డు పటిష్టతను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్స్ కాలనీ జనరల్ సెక్రటరీ విఎస్ఎన్. శ్రీనివాస్ రావు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments