Wednesday, October 28, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్డిజిపి కార్యాలయంలో రక్తదాన శిబిరంను ప్రారంభించిన డిజిపి సి. వి.ఆనంద్

డిజిపి కార్యాలయంలో రక్తదాన శిబిరంను ప్రారంభించిన డిజిపి సి. వి.ఆనంద్

హైదరాబాద్‌

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా డిజిపి కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని డిజిపి సి.వి. ఆనంద్‌ ప్రారంభించారు. అక్టోబరు 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు.. అత్యవసర సమయాల్లో రక్తదానం ద్వారా కూడా ప్రాణదాతలుగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా భద్రతతో పాటు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం పోలీసుల సామాజిక బాధ్యతకు నిదర్శనమన్నారు.

కార్యక్రమంలో డిజి లా & ఆర్డర్ మహేశ్‌ భగవత్‌, ఎడిజి అకున్ సబర్వాల్, మల్టీ జోన్ II, ఐజి షానవాజ్ ఖాసీం, రెడ్‌క్రాస్‌ సొసైటీ డైరెక్టర్‌ పిచ్చిరెడ్డి తో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments