Saturday, October 17, 2026
Google search engine
Homeతెలంగాణఢిల్లీలో నిరసనలకు చెక్: అభిజీత్ దీప్కే, నేహా బోరా అరెస్టు

ఢిల్లీలో నిరసనలకు చెక్: అభిజీత్ దీప్కే, నేహా బోరా అరెస్టు

సెంట్రల్ పార్క్ పరిసరాల్లో ఆంక్షలు.. ఉద్రిక్త వాతావరణం.

అధికారుల ఆంక్షల పర్వం నడుమ దేశ రాజధానిలో ప్రజాస్వామ్య నిరసనలపై రక్షక భటుల ఉక్కుపాదం మళ్లీ మోగింది. ‘లేహ్రా దో తిరంగా’ అంటూ జాతీయ జెండా పట్టుకుని శాంతియుతంగా ర్యాలీ తీస్తామంటేనే పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సిజేపి నేత అభిజీత్ దీప్కే, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాలను నివాసాల వద్దే అక్రమంగా నిర్బంధించి నిరసన గొంతును నొక్కేశారు. వేలాదిగా బలగాలను దించి కన్నాట్ ప్లేస్‌ను దొంగల వేటలా ముట్టడించిన తీరు చూస్తుంటే.. అసమ్మతి స్వరం వింటేనే ఈ రక్షకులు, పాలకులు ఏ స్థాయిలో వణికిపోతున్నారో స్పష్టమవుతోంది!

న్యూఢిల్లీ

‘లేహ్రా దో తిరంగా’ పేరిట శుక్రవారం సాయంత్రం ర్యాలీ చేపట్టాలని సిజేపి ఇచ్చిన పిలుపు నేపథ్యంలో దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేగింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిజేపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను, నిరసన ప్రదేశానికి బయలుదేరిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను ఢిల్లీ రక్షక భటులు (పోలీసులు) అదుపులోకి తీసుకున్నారు. ఝండేవాలన్‌లోని నివాసం నుంచి దీప్కేను, మండి హౌస్ సమీపంలో నేహా బోరాను నిర్బంధించారు.

హఠాత్ పరిణామాలతో ఉద్రిక్తత:

ఈ నిర్బంధాల సమయంలో నిరసన ప్రదేశాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీప్కే మద్దతుదారులు, రక్షక భటుల నడుమ నెట్టోతలు జరిగాయి. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం లేదని, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు తనకు ఉందని దీప్కే వాదించారు. నిరసనకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని కోరినప్పటికీ, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అనంతరం ఆయనను ప్రత్యేక వాహనంలో తరలించారు.

*వరుస నోటీసులు: బారీ బందోబస్తు:
ఈ చర్యకు ముందు దీప్కేకు రెండు వేర్వేరు నోటీసులు జారీ అయ్యాయి. సెంట్రల్ పార్క్ వద్ద నిరసనకు వెళ్లకూడదని సూచిస్తూ స్థానిక రక్షక భట చట్టం కింద ఒక నోటీసు, అలాగే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్) లోని 163వ ప్రకరణం కింద మరో నోటీసు ఇచ్చారు. అసమ్మతి వ్యక్తమవుతున్న కన్నాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్ మార్గాలను పూర్తిగా మూసివేసి, పరిసర ప్రాంతాలలో కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చారు.

ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిజేపి గత కొన్ని రోజులుగా ఈ ఆందోళన నిర్వహిస్తోంది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై రెండు రోజుల క్రితమే ఆ సంస్థ అగ్రనేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను రక్షక భటులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి ఐదు రోజుల న్యాయస్థాన బంధనం (జుడీషియల్ కస్టడీ) విధించడంతో ప్రస్తుతం వారిద్దరూ తిహార్ జైలులో ఉన్నారు. ఈ తాజా అరెస్టులతో సెంట్రల్ ఢిల్లీ పరిసరాల్లో నగర వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments