- తెలంగాణ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు..
- వేలాదిగా తరలివచ్చిన మహిళలు
ఎల్బీనగర్
తెలంగాణ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ వేడుకలకు వేలాది మంది మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు.ఈ వేడుకలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటారు.కాగా, ప్రముఖ కళాకారులు నల్గొండ గద్దర్ నర్సన్న, బహుజన నౌక ఏపూరి సోమన్న, అరుణోదయ నిర్మల తమ బతుకమ్మ పాటలతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి పాటలకు మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ బతుకమ్మల చుట్టూ ఆడిపాడడంతో స్టేడియం మొత్తం సందడిగా మారింది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. వేలాది మంది మహిళలు ఒకే వేదికపైకి చేరి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చింది. ఈ బతుకమ్మ సంబురాల కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకొని 3 రోజులు అహర్నిశలు కష్ట పడిన మహిళా ప్రెసిడెంట్ సంధ్యా రెడ్డి, ఆర్గనైజర్ జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, వాకిటి నర్సింహ రెడ్డి, లింగారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డి, గీతా రెడ్డి లతా రెడ్డి, విజితా రెడ్డి స్వప్న రెడ్డి, స్వాతి రెడ్డి, లహరిలకు తెలంగాణ రెడ్డి సంఘం అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి వారి బృందం కృతజ్ఞతలు తెలిపారు.



