Wednesday, October 28, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణ పెట్టుబడుల లక్ష్మీ శోభ – డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ–గ్లోబల్ సమ్మిట్ 2026’

తెలంగాణ పెట్టుబడుల లక్ష్మీ శోభ – డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ–గ్లోబల్ సమ్మిట్ 2026’

  • 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానాలు – ఈ నెల 29న న్యూఢిల్లీలో ‘కర్టెన్ రైజర్’
  • సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మలచడం, బహుళ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ–గ్లోబల్ సమ్మిట్ 2026’ను నిర్వహించేందుకు సన్నాహాలు వేగవంతం చేశారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 550కి పైగా ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు.
ఈ సదస్సు నిర్వహణా ఏర్పాట్ల పురోగతిపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ విభాగాల సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, హరిచందన, గౌరవ్ ఉప్పల్, సర్ఫరాజ్ అహ్మద్, కృష్ణ ఆదిత్య, అనుదీప్, శశాంక, కృష్ణ భాస్కర్, వల్లూరి క్రాంతి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్ 29న న్యూఢిల్లీలో ప్రారంభ సన్నాహక వేడుక:
సదస్సుకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకు గాను ఈ నెల 29న న్యూఢిల్లీలో ప్రారంభ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంజయ్ జాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల దౌత్యవేత్తలు, వాణిజ్య ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలు, లభ్యమయ్యే వనరులు, అవకాశాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి ఈ వేడుక దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ప్రాథమిక ప్రచార సమావేశాలను విజయవంతంగా పూర్తి చేశామని, హైదరాబాద్‌లో జరగబోయే ముఖ్య సదస్సుకు మొత్తం 1,500కి పైగా సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని సంజయ్ జాజు వివరించారు.

*రక్షణ, విమానయాన రంగాలకు ప్రాధాన్యం
సదస్సులో భాగంగా ఏర్పాటు చేయనున్న రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా విమానయాన, రక్షణ రంగాలకు చెందిన 100 సంస్థలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్లు సంజయ్ జాజు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ఉన్న అనుకూల పారిశ్రామిక వాతావరణం, పరిశోధనా రంగాలు ఈ ప్రదర్శన ద్వారా మరింత పురోగతి సాధిస్తాయని వెల్లడించారు.

25 రంగాలుగా ప్రధాన వేదిక:

ఫ్యూచర్ సిటీలోని ప్రధాన వేదికను 25 సెక్టార్లుగా విభజించి ప్లీనరీ సమావేశాలు, వాణిజ్య ఒప్పందాలు, పారిశ్రామిక ప్రదర్శనలు, చర్చాగోష్ఠులకు అవసరమైన వసతులను సిద్ధం చేస్తున్నట్లు సంజయ్ జాజు తెలియజేశారు. విదేశీ, దేశీయ ప్రతినిధులకు రవాణా, వసతి సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ప్రతినిధికి ఒక సీనియర్ అధికారుని నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు ఆదేశించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కళారూపాల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను సంజయ్ జాజు ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments