Thursday, November 5, 2026
Google search engine
Homeతెలంగాణదీపావళి వేళ చిన్నారుల కంటి భద్రతపై వాసన్ ఐ కేర్ అవగాహన....

దీపావళి వేళ చిన్నారుల కంటి భద్రతపై వాసన్ ఐ కేర్ అవగాహన….

15 ఏళ్ల చిన్నారులకు కంటి చికిత్స లకు వాసనా ఐ కేర్ హాస్పిటల్లో ఉచిత వైద్యo….
వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ వికాస్…


శేరిలింగంపల్లి

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా ప్రమాదాల నుంచి చిన్నారుల కళ్లను కాపాడుకోవాలని వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ వికాస్ అన్నారు. చందానగర్ లోని గంగారం సమీపంలోని వాసన్ ఐ కేర్ సెంటర్లో ‘సురక్షిత కళ్లు మరింత సురక్షిత దీపావళి’ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సురక్షిత కళ్ళు,సురక్షిత దీపావళి, ఈ దీపావళి మీ చిన్న పిల్లలను కాపాడుకోండి అని ఏర్పాటు చేసిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్. వికాస్ (సీఈఓ ), డాక్టర్. రతన్ కుమార్ (మెడికల్ డైరెక్టర్), డాక్టర్ ఉమ, డాక్టర్. స్నేహిత, డాక్టర్.తేజస్విని, డాక్టర్.శైలజ, డాక్టర్. రేష్మ, మాట్లాడుతూ నవంబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బాణసంచా ప్రమాదాల్లో కంటి గాయాలకు గురైన 15 ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత కంటి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. బాణసంచా కాల్చే సమయంలో పిల్లలు తప్పనిసరిగా రక్షణ కళ్లజోడు ధరించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు కంటికి గాయమైతే వెంటనే వాసన్ ఐ కేర్ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. దీపావళి సందర్భంగా నాణ్యతతో కూడిన క్రాకర్స్ ను వినియోగించాలన్నారు. క్రాకర్స్ కాల్చే సమయంలో దగ్గరలోని బకెట్లో నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. చిన్నపిల్లలను క్రాకర్స్ కాల్చి సమయంలో దూరంగా ఉంచాలని సూచించారు. క్రాకర్స్ ను ఓపెన్ ప్రదేశంలో కాల్చాలన్నారు. ఇంటి లోపల కాల్చకూడదని సూచించారు. ఇంట్లో పెంచుకునే జంతువులు పిల్లులు కుక్కలు వాటికి దూరంగా టపాసులు కాల్చాలన్నారు. మద్యం సేవించి క్రాకర్స్ కాల్చే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. క్రాకర్స్ కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించాలన్నారు. 15 సంవత్సరాలలోపు చిన్నారులకు క్రాకర్స్ కాల్చే సమయంలో కంటికి ఏమైనా గాయాలు జరిగితే వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు.అవసరమైతే శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా నిర్వహిస్తామన్నారు.ఈ సేవలు అన్ని వాసన్ ఐ కేర్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments