Wednesday, November 11, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన ఆకతాయిలు

ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన ఆకతాయిలు

ఎల్బీనగర్,

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరి నగర్ కాలనీలో అర్ధరాత్రి వేళ ఆకతాయిలు సృష్టించిన భయాందోళన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలకు దుండగులు కావాలనే నిప్పు పెట్టి పరారయ్యారు.సిరి నగర్ కాలనీలో అర్ధరాత్రి దాటిన తర్వాత నివాసాల ముందు పార్క్ చేసి ఉన్న రెండు బైక్‌లపై దుండగులు నిప్పు రాజేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు ఆర్పివేసే ప్రయత్నం చేసినప్పటికీ, ఒక బైక్ పూర్తిగా కాలి బూడిదవ్వగా, మరొక బైక్ పాక్షికంగా దగ్ధమైంది.ఈ ఘాతకానికి పాల్పడిన దుండగులు బైక్స్‌కు నిప్పు పెట్టి అక్కడ నుంచి పరారవుతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. గతంలో కూడా ఇదే కాలనీలో సరిగ్గా ఇదే తరహాలో రెండు కార్లకు దుండగులు నిప్పు పెట్టిన ఘటనలు జరిగినట్లు కాలనీవాసులు వాపోతున్నారు. వరుసగా వాహనాలను లక్ష్యంగా చేసుకుని తగలబెడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments