ఎల్బీనగర్:
సర్ ప్రక్రియలో భాగంగా సరూర్నగర్ డివిజన్ పరిధిలోని వార్డ్ ఆఫీసులో నిర్వహించిన హియరింగ్ కు సరూర్నగర్ మండల తహసీల్దార్ పి. వేణుగోపాల్ హాజరై వచ్చిన ఓటర్లందరినీ ఉద్దేశించి మాట్లాడారు. హియర్ రింగ్ జరుగుతున్న తీరును తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తహసీల్దార్ పి. వేణుగోపాల్ మాట్లాడుతూ,
1.నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన 11 పత్రాలలో ఏదో ఒక పత్రాన్ని హియరింగ్ సందర్భంలో సమర్పించాలని, అలాగే కొత్తగా ఓటు నమోదు కొరకు ఫామ్ 6, చిరునామా, తదితర అంశాల మార్పుల కోసం ఫామ్ 7, 8లను ఉపయోగించుకోవాలని, పూర్తి చేసిన దృవ పత్రాలను బీఎల్ఓలకు అందజేయాలనీ తెలియజేశారు.
2.ఏదైనా కారణం చేత హియరింగ్ కు హాజరు కాలేని ఓటర్లు తమ పత్రాలను బీఎల్ఓకు అందజేయవచ్చునని తెలిపారు. ఇప్పటివరకు మహేశ్వరం నియోజకవర్గంలో సరూర్నగర్ మండల పరిధిలోని వారి వారి సూపర్ వైజర్స్ పరిధిలో నిర్వహించిన హియరింగ్ కు హాజరు కాలేకపోయిన ఓటర్లకు ఈ నెల సెప్టెంబర్ 5, 6 తేదీలలో ప్రత్యేక శిబిరంలో హియరింగ్ ను ఏఈఆర్ఓ నిర్వహిస్తారని, ఈ ప్రత్యేక శిబిరంలో హియరింగ్ కు ఇప్పటివరకు నోటీసులు అందుకున్న ఓటర్లు ఎవరైతే ఇంకా డాక్యుమెంట్స్ ఇవ్వలేదో, ఆ ఓటర్లందరూ వచ్చి తమ తమ పత్రాలను సబ్మిట్ చేయవచ్చునని తెలియజేశారు.వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యం బాగా లేనివారు, ఇంకా ఏదైనా కారణం చేత హియరింగ్ కు హాజరు కాలేని ఓటర్లు తమ తమ పత్రాలను డైరెక్ట్ గా బీఎల్ఓకు అందించవచ్చునని ఏఈఆర్ఓ పి.వేణుగోపాల్ తెలియజేశారు.


