Saturday, November 28, 2026
Google search engine
Homeతెలంగాణనేడే ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం.

నేడే ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం.

బర్కత్ పుర సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో

ఎల్బీనగర్

ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కేంద్ర కార్యవర్గ సమావేశం ఈనెల 28వ తేదీ శనివారం బర్కత్ పురలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని పత్రికా విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పండిట్ ఎస్ డీ శర్మ, సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు తెలంగాణ ఇంచార్జ్ సత్యనారాయణ మూర్తి తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి బ్రాహ్మణ సమస్యల మీద జాతీయ స్థాయిలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, బ్రాహ్మణులకు రాజకీయ సామాజిక రంగాలలో గుర్తింపు తదితర అంశాల మీద చర్చించటానికి 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన తెలియజేశారు.ఈ సమావేశానికి కేంద్ర కమిటీ సభ్యులందరూ హాజరు అవుతారని అదేవిధంగా రాష్ట్ర మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు,మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చార్యులు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు,మాజీ ఐఏఎస్ అధికారి కే.వి రమణాచారి జస్టిస్ బులుసు శివశంకర్ మాజీ ఎమ్మెల్సీలు గిడుగు రుద్రరాజు,వాణి దేవి తదితర బ్రాహ్మణ ప్రముఖ నాయకులు పాల్గొంటారని ఈ పత్రికా విలేకరుల సమావేశంలో జాతీయ కార్యదర్శులు వక్కలంక శ్రీనివాసరావు, వారణాసి వంశీ, వైష్ణవి ప్రసాద్ జాతీయ ఉపాధ్యక్షులు చింతపల్లి మంగపతి రావు తదితరులు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments