Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించాలి

ఎల్బీనగర్:

ఆర్కేపురం, ఎన్టీఆర్ నగర్ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలకాపురి కాలనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం బిఎల్‌ఏలు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.మాజీ శాసనసభ్యులు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, దేప భాస్కర్ రెడ్డిల ఆదేశాల మేరకు రెండు డివిజన్ల పరిధిలోని పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో బిఎల్‌ఏలు, మరియు ముఖ్య కార్యకర్తలకు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని డివిజన్ అధ్యక్షులు పున్న గణేష్ నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్ పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులందరూ ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకునేలా బిఎల్‌ఏలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శాసన మండలిలో పట్టభద్రుల సమస్యల పట్ల మూర్తి అవగాహన ఉన్న సామ రామ్మోహన్ రెడ్డి గళం వినిపించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్ రెడ్డి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు బండి మధుసూదన్ రావ్ రాష్ట్ర బీసీ నాయకులు గట్ల రవీంద్ర శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ జెల్ల జగన్నాథం, దుర్గాప్రసాద్, పెద్దవూర సైదులు, యాదవ రెడ్డి, మహమ్మద్ రామకృష్ణ గౌడ్, వెంకట రమణారెడ్డి, పగడాల ఎల్లన్న ఆనంద్ కుమార్ పటేల్, రేణుక, కే అరుణ, పి మాధవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments