Saturday, November 21, 2026
Google search engine
Homeతెలంగాణపోలీసుల రాజకీయ పక్షపాతానికి చెక్ పెట్టండి..

పోలీసుల రాజకీయ పక్షపాతానికి చెక్ పెట్టండి..

  • ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి!
  • తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫిర్యాదు..
  • తప్పు చేసిన వారిని ఉపేక్షించబోమని డీజీపీ హామీ!

హైదరాబాద్

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ, స్థానిక ప్రజాప్రతినిధిగా తనకు దక్కాల్సిన గౌరవాన్ని కాలరాస్తూ, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్న పోలీసు అధికారుల తీరుపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా గత మూడేళ్లుగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా చోటుచేసుకుంటున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పోలీసుల దురుసు ప్రవర్తన, పక్షపాత వైఖరిని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే చేతిలోంచి మైక్ లాక్కున్నా ప్రేక్షక పాత్రలో పోలీసులు!

2026 సెప్టెంబర్ 19న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జీఓ 118 కింద ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకుందని ఎమ్మెల్యే వివరించారు. అధికారిక హోదా లేని వ్యక్తులకు వేదికపై ముందు వరుసలో చోటు కల్పించగా, స్థానిక ఎమ్మెల్యేగా తాను ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తన చేతిలోంచి బలవంతంగా మైక్రోఫోన్ లాక్కున్నా పోలీసులు కనీసం జోక్యం చేసుకోలేదని ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధి పట్ల ఇలాంటి వ్యవహారం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

చేయూత పెన్షన్ల కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం..

ఎమ్మెల్యేను వేదిక దిగి వెళ్లాలంటూ ఒత్తిడి!

నవంబర్ 18న చంపాపేట్ మోడల్ మార్కెట్‌లో జరిగిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోనూ ఇదే తరహా ఘటన పునరావృతమైందని సుధీర్ రెడ్డి వివరించారు.ఉదయం 10:30 గంటలకు జరగాల్సిన కార్యక్రమం సాయంత్రం 4:30 గంటలకు వాయిదా పడినట్లు అధికారులు సమాచారం ఇవ్వడంతో, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే ముందుగానే కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుని దాదాపు రెండు గంటల పాటు స్వయంగా పర్యవేక్షించారు. అయితే ప్రకటించిన సమయానికి కాకుండా సుమారు సాయంత్రం 6:15 గంటలకు కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు.అప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో హాలు, వేదిక నిండిపోయాయని, అనంతరం అధికారుల ఆహ్వానం మేరకు తాను వేదికపైకి వెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాటించాల్సిన ప్రోటోకాల్‌పై సంబంధిత ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌ వికాస్ మహతోను ప్రశ్నించే సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తనతో దూకుడుగా వ్యవహరిస్తూ ఘర్షణకు దిగేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకుని శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా తనకు, తన పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకంగా, పక్షపాతంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వేదిక దిగి వెళ్లాలని ఆదేశించడంతో పాటు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నించారని డీజీపీకి ఫిర్యాదు చేశారు.

*పక్షపాతానికి పాల్పడిన అధికారులపై చర్యలు..!

ఈ ఘటనలకు సంబంధించి ప్రధానంగా ఎల్బీనగర్ కు చెందిన నలుగురు పోలీసు అధికారుల ప్రవర్తనపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే. సైదులు, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం,ఎల్బీనగర్ డివిజన్ ఏసిపి రవీందర్ రెడ్డి, చైతన్యపురి డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ వెంకటేశ్వర్లు వీరు నలుగురు అధికారులు నాతో, మా పార్టీ కార్యకర్తలతో చాలా అవమానకరంగా ప్రవర్తించారని, ఇలాంటి
అధికారుల ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి, ప్రోటోకాల్ ఉల్లంఘనలకు, పక్షపాత వైఖరికి పాల్పడినట్లు తేలితే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు.

డీజీపీ హామీ..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరిగే అన్ని అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూళ్లను స్థానిక ఎమ్మెల్యేకు ముందుగానే తెలియజేయాలని, ప్రజాప్రతినిధికి తగిన ప్రోటోకాల్, గౌరవం కల్పించాలని, పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ, చట్టాలను ఉల్లంఘించిన వారిపై తప్పకుండా తగిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజాప్రతినిధికి ప్రత్యేక హక్కులు అవసరం లేదు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments