చెరువులు, కుంటలు, నదుల్లోకి ప్రజలు దిగవద్దు…
రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ అప్రమత్తం..
అత్యవసర సమయాల్లో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ సేవలు పొందాలి…
సూర్యాపేట ఎస్పీ నరసింహ..
ప్రజల రక్షణలో పోలీసు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారు అని జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఈరోజు సూర్యాపేట రూరల్ పరిధి వేదేరివారి గూడెం వద్ద మూసి నదిపై భీమారం లో-లెవెల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని ఎస్పీ నర్సింహా పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధిక వర్షాల వల్ల చెరువులు నదులు కుంటలు నిండి ప్రమాదకర రీతిలో ఉన్నాయని వాటిలోకి ఎవరు దిగవద్దని ఎస్పీ సందర్భంగా కోరారు. తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలు దృష్ట్యా అతను చెరువులు కుంటలు నీటితో నిండి ఉండి ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి దీనిపై జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రమాదకరంగా ఉన్న స్థలాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం నీటి ప్రవాహం లోకి ఎవరు వెళ్లకుండా రోడ్లపై బారికెడ్ లు, వాహనాలు అడ్డుగా పెట్టడం జరిగింది. అలాగే రోడ్లపై విరిగిపడిన చెట్ల ను తొలగించడం, నీటి ప్రవాహంలో చిక్కుకున్న వాహనాలను తీయడం, ప్రమాదంలో ఉన్న ప్రజలను కాపాడడం జరిగినది, అలాగే తెగిపోయిన రోడ్లను సంబంధిత అధికారితో కలిసి మరమ్మతులు చేయించడం జరిగినది అని తెలిపారు.జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజారక్షణలో నిరంతరం కృషి చేస్తుంది అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవలు రద్దు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచాము అని ఎస్పి అన్నారు.ఆయన వెంట సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రూరల్ ఎస్సై బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు..


