Tuesday, September 29, 2026
Google search engine
Homeతెలంగాణబాలాపూర్‌లో బరితెగించిన భవన మాఫియా.. అనుమతి ఒకటి.. అక్రమ నిర్మాణం మరోటి!

బాలాపూర్‌లో బరితెగించిన భవన మాఫియా.. అనుమతి ఒకటి.. అక్రమ నిర్మాణం మరోటి!

  • కాగితాలపై 2 అంతస్తుల గృహ నివాస అనుమతులు, క్షేత్రస్థాయిలో కమర్షియల్ ఆరంతస్తుల అక్రమ కట్టడం!
  • అధికారుల మౌనం.. అక్రమ నిర్మాణదారులకు కొండంత బలం!
  • ప్రభుత్వ ఆదాయానికి తూట్లు.. మున్సిపల్ ఖజానాకు భారీ గండి!
  • అగ్నిప్రమాదాల ముప్పు.. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు యాక్సిడెంట్లతో ప్రాణం నష్టం.

*చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై వేటు పడేనా?

బాలాపూర్‌ ఎక్స్‌ రోడ్డులో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, నిబంధనలను కాలరాస్తున్న ఈ అక్రమ కట్టదంపై ఉన్నతాధికారులు (GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ చంద్రకళ) తక్షణమే స్పందించి జేసీబీలతో కూల్చివేతలు చేపట్టాలి. నిబంధనలను ఉల్లంఘించిన భవన యజమానిపై, అక్రమాలకు మద్దతు ఇస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

బడంగ్పేట్ :

: నగరంలో అక్రమ నిర్మాణాల పర్వం అడ్డూఅూపులేకుండా సాగుతోంది. నిబంధనలను కాలరాస్తూ, అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని వెలుస్తున్న అక్రమ కట్టడాలు ప్రజల ప్రాణాలకు మునుపెన్నడూ లేని విధంగా ముప్పుగా మారుతున్నాయి. తాజాగా బాలాపూర్ ప్రధాన రహదారిని ఆనుకుని జరుగుతున్న ఓ భారీ కమర్షియల్ నిర్మాణం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మున్సిపల్, అగ్నిమాపక నిబంధనలను పూర్తిగా విస్మరించి చేపడుతున్న ఈ నిర్మాణంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*నిబంధనలకు పాతర.. నిబంధనల ఉల్లంఘనల పర్వం:
ఎస్.ఎల్.ఎన్.ఎస్ కాలనీ, బాలాపూర్ ఎక్స్ రోడ్, మీర్పేట్ పరిధిలోని హౌస్ నంబర్ 6-106 ప్రాంతంలో ఈ అక్రమ నిర్మాణం యథేచ్ఛగా సాగుతోంది.

  • అనుమతులు ఒకటి.. నిర్మాణం మరోటి: జీ+2 రెసిడెన్షియల్ భవనానికి అనుమతి పొంది, దానికి విరుద్ధంగా ఏకంగా లోతైన సెల్లార్‌ను తవ్వి ఆరంతస్తుల భారీ కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తున్నారు.
  • సెట్‌బ్యాక్‌ల ఉల్లంఘన: ప్రధాన రహదారి పక్కనే ఉన్నప్పటికీ ఎలాంటి సెట్‌బ్యాక్‌లు వదలకుండా చుట్టూ స్థలాన్ని ఆక్రమిస్తూ భవనాన్ని నిర్మించడం గమ్యస్థానం.
  • ప్రభుత్వ ఆదాయానికి గండి: వాణిజ్య అవసరాల కోసం భారీ భవనాన్ని నిర్మిస్తూ, కేవలం నివాస భవన పర్మిట్లతో మున్సిపల్ ఖజానాకు అందవలసిన లక్షలాది రూపాయల పన్నులను ఎగవేస్తున్నారు.

*ముప్పు పొంచివున్న ప్రాణాలు.. ట్రాఫిక్ ఇబ్బందులు:
ఈ అనధికార కమర్షియల్ భవనం వల్ల భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • అగ్నిప్రమాదాల భయం: ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకుండా నిర్మిస్తున్నందున, భవిష్యత్తులో ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రాణనష్టం జరిగే ముప్పు పొంచి ఉంది.
  • ట్రాఫిక్ సమస్యలు: ప్రధాన రహదారిని ఆనుకుని సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మాణం చేపట్టడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

*అధికారుల ఉదాసీనత.. నెలలు గడుస్తున్నా చర్యలు శూన్యం:
ఈ అక్రమ కట్టడంపై బాధ్యతాయుత అధికారులకు ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

  • బడంగ్‌పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సోమయ్య, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కళ్యాణ్, టీపీఎస్ సాయికిరణ్ తదితరులు ఈ తతంగాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
  • కిందిస్థాయి అధికారుల మౌనం అక్రమ నిర్మాణదారులకు కొండంత బలంగా మారుతోంది.

*ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని స్థానికుల డిమాండ్:
ప్రజా ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ భారీ అక్రమ కట్టడంపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, శంషాబాద్ జోన్ జోనల్ కమిషనర్ చంద్రకళ, ఎస్‌టీఎఫ్ బాస్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మెహర్ తదితర ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments