రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుంది..
మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం..
పోలీస్ ల నిర్బంధాల మధ్య బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన కలెక్టరేట్ ముందు వర్షంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ బారి ర్యాలీకి సుమారు 2000 మంది విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు బారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ముందు విద్యార్థులకు రావలసిన పెండింగ్ లో ఉన్న పీజ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని, విద్యాశాఖని సీఎం అంటి పెట్టుకుని ఎలాంటి రివ్యూ లు లేకుండా ఎవరు ఏది ప్రశ్నించినా స్పందించడం లేదన్నారు. సీఎం ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థుల కొరకై పోరాటంలో బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సంఘాలను కలుపుకుని పోరాటం చేసి రాష్ట్రాన్ని రణరంగం చేసి వెంబడిస్తామని హెచ్చరించారు. నిర్బంధాలనన్నింటినీ తెంచుకుని పెద్దఎత్తున తరలివచ్చి ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పారు. పోలీస్ ల లాటి లు తూటా లు విద్యార్తుల ఉద్యమాలకు అడ్డు కాలేవని నిరూపించారని తెలిపారు. ఆరంభం మాత్రమే ఇక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జిల్లా కోఆర్డినేటర్ ధ్యావ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడలేదని ఇప్పుడు ప్రభుత్వం కూడా విద్యార్థుల ఆర్తనాదాలతో చెలగాటం ఆడుతోందని, ఉద్యమ పోరాటం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, నాయకులు బండారపు అజయ్ కుమార్ గౌడ్ ,చుక్కా శ్రీనివాస్ , బొంకూరి మోహన్ , చెన్నమళ్ల చైతన్య ,ఆరే రవి గౌడ్ , గంగాధర చందు , నారదాసు వసంత్ ,వడ్లకొండ పరుశురామ్ , రవి తేజ మున్నా ,బండ వేణు యాదవ్ , ధీరజ్ , పబ్బతి శ్రీనివాస్ రెడ్డి,ఆవుల తిరుపతి , ఒడ్నాల రాజు , ఆలేటి శ్రీరామ్ , సుమంత్ , ఓంకార్ , మణి దీప్ నాయుడు , దినేష్ , తరుణ్ , రావణ్ , కొమ్ము నరేష్ , వొళ్లాల శ్రీకాంత్ , అనిల్ , కౌశిక్ , సంపత్ , హరీష్ , శివ , అకిల్ , అంజి , ప్రశాంత్ , సురేష్ , శ్రీకాంత్ , అనిల్ , సుమంత్ , వినయ్ , శ్రీధర్ , తిరుపతి , జగదీష్ , కైఫ్ ,సాయి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పిటిసికి తరలించారు ..


