భాగ్యనగర్ మున్సిపల్ జీ.హెచ్.ఎం.సి. ఎంప్లాయీస్ యూనియన్, బీ – 1157 ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ఖైరతాబాద్ జోనల్ ఎంప్లాయీస్ బీ.ఎం.ఎస్.లో చేరడం జరిగినది.. యూనియన్ లో చేరినవారిలో జీ. శివ, కృష్ణ ( యూసీడీ ), డిసబులిటి వర్గానికి చెందిన తిరుపతి రెడ్డి, ప్రమీల, అన్నపూర్ణ లు వున్నారు.. ఈ కార్యక్రమం భారతీయ మజ్దూర్ సంఘ్ జోనల్ గడ్డం సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగింది..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీ.ఎం.ఎస్. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, బీ.ఎం.ఈ.యు. ప్రధాన కార్యదర్శి టి. క్రిష్ణ పర్యవేక్షించారు..ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా బీఎంఎస్ అధ్యక్షుడు టి. కష్ణ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు కొనసాగిన పలు యూనియన్లన్నీ ప్రస్తుతం కార్మికులు, ఉద్యోగుల విశ్వసనీయత కొల్పోయి నిర్వీర్యమయ్యే దిశగా ఉండటంతో ఉద్యోగులు, కార్మికులు ప్రత్యామ్నాయంగా బీఎంఎస్ వైపు చూస్తున్నారని, త్వరలోనే మరో వందలాది మంది బీఎంఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వివరించారు. బీఎంఎస్ గడిచిన ఎన్నో దశాబ్దాలుగా సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కులు , ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తూ, అనేక విజయాలు సాధించిందని వివరించారు. జీహెచ్ఎంసీలో యూనియన్లకు సర్కారు గుర్తింపు ఎన్నికలు ఎపుడు నిర్వహించినా, బీఎంఎస్ గెలుపు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బీ.ఎం.ఈ.యూ. (బీ.ఎం.ఎస్.) ఉపాధ్యక్షులు, బిక్షపతి, కార్యదర్శి గడిపల్లి రూపేష్, ఖైరతాబాద్ జోనల్ కార్యదర్శి ఆర్. వెంకటేష్, ఖైరతాబాద్ జోన్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, సర్కిల్ కార్యదర్శి పోచన్న, బీ.ఎం.ఎస్. యూనియన్ కార్యకర్తలు జాల నరేందర్, భారత్ తదితరులు పాల్గొన్నారు..