- ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..
భారత దేశ సైనికులకు శక్తి నివ్వాలని, నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాలలో విజయం సాధించాలని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి.. బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీపురం కాలనీ శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి లు భారతదేశ సైనికులకు శక్తినివ్వాలని, భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో విజయం సాధించాలని, వారికి ఎలాంటి అడ్డంకులు రావద్దని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పద్మారెడ్డి, దామోదర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ప్రదీప్ రెడ్డి, శంకరయ్య గౌడ్, శ్రీధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బిక్షపతి సేటు, కసిరెడ్డి, రాజు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మూర్తి, నరసింహారెడ్డి, నందకిషోర్, మహిపాల్ రెడ్డి, భద్రారెడ్డి, సురేష్ కుమార్, మహిళా సభ్యులు దేవిక, మాధవి, విజయ వైజయంతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు..