Thursday, November 5, 2026
Google search engine
Homeతెలంగాణభూ వినియోగ మార్పులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి...

భూ వినియోగ మార్పులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి…

హెచ్ఎండిఏ ఎండీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినతి

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో భూ వినియోగ మార్పులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బుధవారం హెచ్ఎండిఏ ఎండీ సర్పరాజ్ అహ్మద్ ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో గతంలో ఓపెన్ స్పేస్, కన్జర్వేషన్, ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లుగా కేటాయించిన భూములను నివాస ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సమర్పించారు.ఇందుకు సంబంధించిన అన్ని అవసరమైన పత్రాలను గతంలోనే ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. గతంలో ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చేందుకు జీవో జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, 3 సంవత్సరాలు గడుస్తున్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో ఆ ప్రక్రియను నిలిపివేసిందని విమర్శించారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్న భూ వినియోగ మార్పులకు త్వరగా ఆమోదం తెలిపి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.దానిలో భాగంగా ముసాయిదా భూ వినియోగ మార్పు – 1
బండ్లగూడ (గ్రామం) ఆనంద్ నగర్ మరియు గోపాలకృష్ణపురంలో సర్వే నం.40/P, 41 మరియు 37లోని కొంత భాగం ప్రస్తుతం ఓపెన్ స్పేస్ వినియోగంగా కేటాయించబడింది.
ముసాయిదా భూ వినియోగ మార్పు – 2
ఫతుల్లాగూడ (గ్రామం), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీ మరియు ధనలక్ష్మి నగర్లో సర్వే నం. 51/పి మరియు 52/పి లోని స్థలం ప్రస్తుతం ఓపెన్ స్పేస్ వినియోగంగా కేటాయించబడింది.
ముసాయిదా భూ వినియోగ మార్పు – 3
కర్మన్ఘాట్ (గ్రామం), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, తపోవన్ కాలనీలలో సర్వే నంబర్లు 305, 306, 307, 308, 309, 310లోని స్థలం ప్రస్తుతం తయారీ వినియోగంగా కేటాయించబడింది.
ముసాయిదా భూ వినియోగ మార్పు – 4
కోత్తపేట (గ్రామం), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని రామలింగేశ్వర కాలనీలో సర్వే నంబర్లు 102, 06, 107, 108, 109, 115, 116, 118, 119, 120, 121, 122లోని స్థలం ప్రస్తుతం ఓపెన్ స్పేస్ వినియోగంగా కేటాయించబడింది.
ముసాయిదా భూ వినియోగ మార్పు – 5
లింగోజిగూడ (గ్రామం), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, తపోవన్ కాలనీలలో సర్వే నంబర్లు 25, 26, 27, 28, 29, 30, 64, 65, 66 మరియు 71 నుండి 79 వరకు గల స్థలం ప్రస్తుతం తయారీ వినియోగంగా కేటాయించబడింది.
ముసాయిదా భూ వినియోగ మార్పు – 6
నాగోల్ (గ్రామం), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని సాయినగర్ కాలనీ, అరుణోదయ కాలనీ, కో-ఆపరేటివ్ సొసైటీ కాలనీలలో సర్వే నంబర్లు 96 మరియు 98లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంగా కేటాయించబడింది.
ముసాయిదా భూ వినియోగ మార్పు – 7
బండ్లగూడ (గ్రామం), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఆనంద్ నగర్, గోపాలకృష్ణపురంలో సర్వే నంబర్లు 6, 7, 8, 9, Q 11, 15, 16, 17, 46, 47, 57, 58, 61, 62 మరియు 63లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంగా కేటాయించబడింది.
ముసాయిదా భూ వినియోగ మార్పు – 8
హయత్నగర్ (గ్రామం), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని వినాయక్ నగర్ కాలనీ, కొలన్ శివారెడ్డి నగర్లో సర్వే నంబర్లు 210 మరియు 215లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంగా కేటాయించబడింది.
ముసాయిదా భూ వినియోగ మార్పు – 9
బాగ్ హయత్నగర్ (గ్రామం), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో సర్వే నం. 97లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంగా కేటాయించబడింది.
ముసాయిదా భూ వినియోగ మార్పు – 10
హయత్నగర్ (గ్రామం), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బి.సి. కాలనీలో సర్వే నం. 195/2లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంగా కేటాయించబడింది. దీనిని నివాస వినియోగంగా మార్చాలని ప్రతిపాదించడమైనది.అదే విధంగా బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ప్రజలకు అవసరమైన పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలు, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధికి వెంటనే పరిపాలనాపరమైన, ఆర్థిక అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు.ఈ సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
దీనిపై హెచ్ఎండిఏ ఎండీ సర్పరాజ్ అహ్మద్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అంశాలను పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, వైదేహి నగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పోగుల రాంబాబు, కొత్త భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments