ప్రజల ఫిర్యాదుల స్వీకరణ..
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల..
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల , బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 8 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు.ఫిర్యాదు దారుల ఎదుటే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


