ఘనంగా కార్యక్రమం నిర్వహణ..
కార్యక్రమంలో పాల్గొన్న అదనపు ఎస్.పీ.
భైంసా టౌన్ పరిధిలో రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా శనివారం “ఐక్యత కోసం పరుగు” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో భైంసా అదనపు ఎస్పీ అవినాష్ కుమార్, భైంసా సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ నేతృత్వంలో పరుగు ప్రారంభమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, వైద్యులు, కమ్యూనిటీ పెద్దలు, యువకులు, అలాగే వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సహా దాదాపు 150 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ, జాతి ఏకత, ఐక్యత మరియు సామాజిక సౌహార్దం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన ఐక్యతా స్ఫూర్తిని అనుసరించాలని పిలుపునిచ్చారు.


