Tuesday, November 10, 2026
Google search engine
Homeతెలంగాణమధుయాష్కి గౌడ్ నివాసానికి వైఎస్ షర్మిల - కుమార్తె వివాహానికి సాదర ఆహ్వానం

మధుయాష్కి గౌడ్ నివాసానికి వైఎస్ షర్మిల – కుమార్తె వివాహానికి సాదర ఆహ్వానం

ఎల్బీనగర్

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరు కావాలని కోరుతూ ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ జాతీయ చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కి గౌడ్‌ను వ్యక్తిగతంగా ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న మధుయాష్కి గౌడ్ నివాసానికి ఆమె స్వయంగా వెళ్లి వివాహ పత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె వారి నివాసానికి రావడం ఇదే ప్రథమం కావడంతో మధుయాష్కి గౌడ్ దంపతులు ఆమెకు ఆత్మీయంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఇరువురు నేతలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని, అంతులేని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో షర్మిల పాత్రను మధుయాష్కి గౌడ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి, నాటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారని గుర్తుచేశారు. గాంధీ కుటుంబంతో వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆమె చేస్తున్న విశేష కృషిని అభినందించారు.

ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా చేపట్టవలసిన వివిధ కార్యాచరణ కార్యక్రమాలు, భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించడంపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments